రూ.4వేల కోట్ల నిధులు విడుదల చేయండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం రేవంత్, భట్టి విజ్ఞప్తి

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ బిజీబిజీగా వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు.

Update: 2024-01-13 11:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ బిజీబిజీగా వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్రం నుంచి పౌర సరఫరాల శాఖకు రావాల్సిన రూ.4,246 కోట్ల నిధులు విడుదల చేయాలని కొరారు. అంతకు ముందు సీఎం ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌తో వారు భేటీ అయ్యారు. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేషన్ పదవుల భర్తీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానంతో రేవంత్‌తో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..