CM Revanth: ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Update: 2024-09-02 14:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షం సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. మరో 5 రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించబోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.


Similar News