కేఏ పాల్ సభలో సీఎం, పీఎం నినాదాలు (వీడియో)
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి లక్ పరీక్షించుకున్న కేఏ పాల్ ఇక్కడ చేదు ఫలితాలు రావడంతో ఏపీపై ఫోకస్ పెంచారు. ఏపీలో విశాఖ పట్నం నుంచి ఎంపీగా ఇటీవల పోటీ చేశారు. అయితే ఆయన పాల్గొన్న సభలో ఆయన ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా కొంత మంది ఏకంగా పీఎం.. పీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు సీఎం, పీఎం అని నినాదాలు చేస్తుండగా కేఏపాల్ నవ్వుతూ అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు అయితే ప్రముఖ హస్యనటుడు బాబుమోహన్ ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే.