Cm Revanth Reddy: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి సీఎం యూనివర్సిటీ నిర్మాణానికి గురువారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో 4 సెంటర్లకు సీఎం ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు సీఎం శంకుస్థాపన చేశారు. కాగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం బిల్లును ఇవాళ శాసనసభ ఆమోదం తెలిపింది.