మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హన్మకొండలో కేసీఆర్ రోడ్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హన్మకొండలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని అన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ అజెండా అని విమర్శించారు. బీజేపీ అజెండాలో ప్రజల కష్ట సుఖాల గురించి ఎప్పుడూ ఉండదని అన్నారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ వందల కొద్దీ నినాదాలు ఇచ్చారు.. అచ్చే దిన్.. అమృత్ కాల్ వచ్చిందా అని ప్రశ్నించారు. నల్లధనం తెచ్చి అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్నారు.. మీరు మీకు వచ్చాయా అని క్వశ్చన్ చేశారు. కాజీపేటకు ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి నీళ్లు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నదుల అనుసంధానం పేరిట గోదావరి నీళ్లు తీసుకుపోవాలని చూస్తున్నారని అన్నారు. 400 కాదు కదా.. మోడీకి 200 ఎంపీ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో హంగ్ వస్తే.. తెలంగాణ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదారి ఎత్తుకుపోతామనే బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలుస్తేనే తెలంగాణ క్షేమమని అన్నారు. తెలంగాణ తరుఫున పోరాడే బీఆర్ఎస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.