తెలంగాణ ఆత్మగౌరవానికి బతుకమ్మ ప్రతీక: సీఎం కేసీఆర్

తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రగతి భవన్‌ నుంచి ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మతో తెలంగాణ ఔన్నత్యం విశ్వవ్యాప్తమైందని అన్నారు.

Update: 2023-10-14 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రగతి భవన్‌ నుంచి ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మతో తెలంగాణ ఔన్నత్యం విశ్వవ్యాప్తమైందని అన్నారు. ఆడబిడ్డలు పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంసృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకొంటూ, తెలంగాణ సంసృతీ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని చెప్పారు.

ఈ బతుకమ్మను ఆడబిడ్డలంతా ఆటా పాటలతో కోలాటాలతో కలిసికట్టుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంసృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వ వ్యాప్తంగా చాటుతుందని తెలిపారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు మహిళా సాధికారతను పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు.

Tags:    

Similar News