అసెంబ్లీలో మొదటిసారి ఈటల పేరు ప్రస్తావించిన కేసీఆర్
అసెంబ్లీలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంచిన పంటను కొనడానికి కూడా కేంద్రం చిన్నచూపు చూసి అనేక ఇబ్బందులు పెట్టిందని గుర్తుచేశారు. ఇటీవల బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్‌కు అన్ని విషయాలు తెలుసని అన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్తే అన్నీ మర్చిపోతారా? అని ప్రశ్నించారు. 'గత కొన్ని రోజులుగా సందు దొరికితే చాలు మా రాజేందరన్న మమ్మల్ని బద్నాం చేయాలనే చూస్తున్నాడు' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వడ్లు కొనాలని అడిగితే.. నూకలు తినమంటారా? కేంద్రానికి ఇంత అహంకారమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లాంటి ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. బీజేపీ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 తర్వాత దేశంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు.