కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుంది: ఎమ్మెల్సీ కవిత
క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తో కలిసి మెదక్ పట్టణంలోని ప్రముఖ చర్చిని సందర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితి(MLC Kavithi), మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తో కలిసి మెదక్ పట్టణంలోని ప్రముఖ చర్చి(Church)ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం(Media conference)లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ (ChristmasGreetings) తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మెదక్ పట్టణం ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడి అభివృద్ధి వైపు అడుగులు వేసిందని.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లాకు అన్ని రకాలుగా నీటిని అందించే విధంగా ప్రణాళికలు రూపొందించామని.. ఈ క్రమంలోనే కాళేశ్వరం నుంచి రామాయణ్‌పేట్ కెనాల్ ను పూర్తి చేసి.. నీటిని అందించాలని నిర్ణయించామని.. ఈ క్రమంలో ప్రభుత్వం మారింది. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రామాయణ్‌పేట్ కెనాల్ నిర్మాణాన్ని నిలిపివేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కొనసాగించాలని సీఎంకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇచ్చిన హామీలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అనేక హామీలు ఇచ్చిందని.. వాటిలో కేవలం ఫ్రీ బస్సు, సిలిండర్ పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారని.. మహిళలకు తులం బంగారం, 18 ఏళ్లు నిండిన యువతులకు ఫ్రీ స్కూటీ, వంటి అనేక పథకాలను అమలు చేయకుండా తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేశారని మండిపడ్డారు. అలాగే ఎన్నికల సమయంలో షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు వాటిపై ఎటువంటి రివ్యూ మీటింగ్ కూడా జరగలేదని.. ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అలాగే తక్షణమే రైతు భరోసా ఇవ్వాలని, తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డులను అందించాలని ఆమె కోరారు.