బ్రేకింగ్: మరోసారి నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రాష్ట్ర నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు.

Update: 2023-03-10 04:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అధికారుల బృందంతో కలిసి నూతన సచివాలయం భవనం దగ్గరకు వెళ్లి పనులను పరిశీలించారు. తర్వాత సెక్రటేరియట్ ముందు రోడ్డును కూడా కేసీఆర్ పరిశీలించిన కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పలువురు అధికారులు ఉన్నారు.

మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో సచివాలయ పనులను సైతం వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే పలుమార్లు సచివాలయన్ని సందర్శించి పనులను పర్యవేక్షించారు. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభ తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది. కాగా, కేసీఆర్ పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 17వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో సెక్రటేరియట్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ మళ్లీ సెక్రటేరియట్ పనులను పరిశీలించేందుకు సీఎం వెళ్లడంపై త్వరలో ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్థూపాన్ని సైతం సీఎం కేసీఆర్ పరిశీలించారు. 

Tags:    

Similar News