అనుకున్న పనిచేసిన CM KCR!

శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌‌కు వచ్చారు.

Update: 2022-12-26 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌‌కు వచ్చారు. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్వాగతం పలికారు. ఇవాళ్టి(సోమవారం డిసెంబర్ 26) నుంచి ఈనెల 30 వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నియలంలో ఆమె బస చేయనున్నారు. అయితే, ముందుగానే అందరు ఊహించిన విధంగానే రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. కాగా, గతకొంత కాలంగా బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఎవరు రాష్ట్రానికి వచ్చిన కేసీఆర్ స్వాగతం పలకడం లేదు. తాజాగా.. రాష్ట్రపతి ముర్ముకు సైతం స్వాగతం పలకకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సత్యవతి రాథోడ్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read...

రాష్ట్రపతికి స్వాగతం పలికిన Governor Tamilisai

Tags:    

Similar News