రేపు కొండకల్‌కు :CM KCR

కొండకల్‌లో గల రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నట్లు తెలిసింది.

Update: 2023-06-21 03:55 GMT

దిశ, శంకర్‌పల్లి: కొండకల్‌లో గల రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో నిర్మించ తలపెట్టిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం రామచంద్రపురం మండలం వెలిమల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి అక్కడి నుంచి ముఖ్యమంత్రి శంకర్ పల్లి మండలంలోని కొండకల్‌కు రానున్నారు. ఏ సమయానికి వస్తారనేది ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వస్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రెవెన్యూ ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా 2018 సంవత్సరంలో కొండకల్ గ్రామంలోని సర్వే నెంబర్ 310 గల 100 ఎకరాలలో రూ. 800 కోట్ల నిధులతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించిన విషయం తెలిసిందే.

Also Read..

Revanth Reddy: పోటీ చేసే స్థానం ఇదే.. సోదరుడు తిరుపతి రెడ్డి క్లారిటీ  

Tags:    

Similar News