ఫాం హౌస్ ఘటనపై సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్.. 3 గంటల వీడియో
సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఫామ్ హౌస్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చాలా దు:ఖంతో ప్రెస్ మీట్ పెడుతున్నాను
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఫామ్ హౌస్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చాలా దు:ఖంతో ప్రెస్ మీట్ పెడుతున్నాను. సుప్రీం కోర్టు సహా దేశంలో అందరూ న్యాయమూర్తుల్ని చేతులు జోడించి కోరుతున్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్నారు. దేశంలోని సీజేఐ సహా, సుప్రీం కోర్టు జడ్జిలందరికీ, హైకోర్టు న్యాయమూర్తులందరికీ, మీడియా వ్యవస్థలకు ఫాం హౌస్ ఫైల్స్ పంపించానన్నారు. సీబీఐ, ఈడీ సహా అన్ని విచారణ సంస్థలకు కూడా ఆధారాలను పంపించానన్నారు. తెలంగాణ హైకోర్టుకు కూడా పంపాను, అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు వీడియోలు పంపుతాను అన్నారు.
బీహార్ వెళ్లి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని స్వయంగా ప్రధానే చెప్పారు. ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తారని పేర్కొన్నారు. గత నెలలో ఇక్కడికి రామచంద్రభారతి వచ్చారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారు, ఫామ్ హౌస్ కు సంబంధిచిన ఫైల్స్ మూడుగంటల పాటు ఉన్నాయన్నారు. ఆ వీడియోలో, 8 ప్రభుత్వాలను ఇప్పటికే కూల్చామని అంటున్నారు. మరో నాలుగు ప్రభుత్వాలు కూల్చుతామన్నారు. తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్, ప్రభుత్వాలను కూల్చుతారంట. రాక్షసుల కుట్రను బద్దలు కొట్టడానికే ఆ ముఠాను పట్టుకున్నామన్నారు. దేశంలోని అన్ని పత్రికా సంస్థలకు ఈ వీడియోలు పంపించానని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
బిగ్ న్యూస్.. ఫాం హౌస్ వీడియోలు లైవ్ టెలికాస్ట్ చేసిన కేసీఆర్
పాల్వాయి స్రవంతిని కలవడంపై సీఎం KCR క్లారిటీ
చెప్పుకోలేని బాధ... జీహెచ్ఎంసీలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల వ్యధ