నేను ఉన్నన్ని రోజులు పోచారం సేవ చేయాల్సిందే: సీఎం KCR

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. నాటి పాలకులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Update: 2023-03-01 13:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. నాటి పాలకులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం చేపట్టడానికి గల కారణాల్లో నిజాంసాగర్ నీళ్లు కూడా ఒక అంశం అని చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో స్వామివారికి చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని కేసీఆర్ సతీమణి స్వామివారికి సమర్పించారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం పాల్గొని మాట్లాడారు.

ఈ ఆలయం చాల బాగుందని.. క‌ళ్యాణంలో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం మ‌రో ఏడు కోట్ల రూపాయ‌లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు సీఎం ప్రకటించారు. ఈ ప్రాంతం గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొందని ప్రస్తుతం ఈ ప్రాంతంలో 15 వందల కోట్ల వరి పంట సాగవుతోందని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికోసం ఎంతో కష్టపడ్డారని బాన్సువాడ ప్రజలకు భవిష్యత్‌లో స్పీకర్ పోచారం సేవలు అవసరమన్నారు. తానున్నన్ని రోజులు పోచారం ప్రజలకు సేవ చేయాల్సిందే అని చెప్పారు.

Tags:    

Similar News