ఆసిఫాబాద్‌కు కొమురం భీం పేరు నేనే పెట్టా: CM. KCR

ఆసిఫాబాద్‌ను జిల్లాను చేసింది బీఆర్ఎస్సే.. ఆసిఫాబాద్‌కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అని పేరు నేనే పెట్టానని సీఎం కేసీఆర్ తెలిపారు. బుధవారం ఆసిఫాబాద్‌లో తలపెట్టిన బీఆర్ఎస్

Update: 2023-11-08 10:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసిఫాబాద్‌ను జిల్లాను చేసింది బీఆర్ఎస్సే.. ఆసిఫాబాద్‌కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అని పేరు నేనే పెట్టానని సీఎం కేసీఆర్ తెలిపారు. బుధవారం ఆసిఫాబాద్‌లో తలపెట్టిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకపోతే ఆసిఫాబాద్ ఎప్పటికీ జిల్లా కాకపోయేదన్నారు. ఆసిఫాబాద్‌కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. గతంలో వానకాలం వస్తే ‘మంచం ఎక్కిన మన్యం’ అని పేపర్లలో వార్తలు వచ్చేవి.. కానీ బీఆర్ఎస్ వచ్చాక ఆసిఫాబాద్‌లో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. ఆసిఫాబాద్ జిల్లా అయ్యాక చాలా మేలు జరిగిందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి కానీ ప్రజాస్వామ్యం గెలవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏం చేశాయో బేరీజు వేసుకోవాలని సూచించారు. పేదలను ఆదకోవాలనే ఆలోచన ఎవరూ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు దుబారా అంటుందని ఫైర్ అయ్యారు. రైతు బంధు ఉండాలా.. వద్దా అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ కావాలా..? 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News