ప్రగతి భవన్ సిబ్బందికి బట్టలు పెట్టిన KCR.. కారణం అదేనా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మరి కొన్ని గంటల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో తెలంగాణలో

Update: 2023-12-02 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మరి కొన్ని గంటల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ప్రభుత్వాన్ని ఎవరూ ఏర్పాటు చేస్తారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అన్ని పార్టీల అభ్యర్థుల ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ చేసిన పని ఆసక్తికరంగా మారింది. ప్రగతి భవన్‌లో సిబ్బందికి కేసీఆర్ కానుకలు అందించారు. శుక్రవారం సిబ్బందికి కొత్త బట్టలు పెట్టడంతో పాటు ఇతర వస్తువులను అందించారు. అనంతరం కాసేపు వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్ చేసిన ఈ పని ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే కేసీఆర్ సిబ్బందికి బట్టలు పెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు విడుదలైన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌ ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. రెండు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ సారి భంగాపటు తప్పదని చెప్పాయి. దీంతో ఓటమిని ముందుగానే పసిగట్టిన గులాబీ బాస్.. ఇన్నాళ్లు ప్రగతి భవన్‌లో తనకు సేవలందించిన సిబ్బందికి బట్టలు పెట్టి.. చివరి సారిగా వారితో మాట్లాడి యోగక్షేమాల గురించి వాకబు చేసినట్లు సందేహం వ్యక్తం అవుతోంది. ఇక కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సిందేనని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అంటుండగా.. గులాబీ బాస్ చేసిన ఈ పని కొత్త చర్చకు దారి తీసింది. అయితే, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది.. నెక్ట్స్ సీఎం ఎవరూ అన్నది తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే.


Similar News