ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 105 సీట్లు గెలుస్తాం.. సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లు ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Update: 2023-05-17 12:18 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 6 నెలల్లో ఎన్నికలు ఉంటాయని పార్టీ శ్రేణులకు కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో పార్టీని బలంగా నిలబెట్టేందుకు నేతలు కృషి చేయాలని చెప్పారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెబితే చాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ చెప్పారు.

రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్ వంటి పలు పథకాల గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, అలాగే బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని సీఎం అన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. తెలంగాణ సిద్ధించి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది దినోత్సవాలను జూన్ 2 నుంచి జూన్ 21 వరకు ఘనంగా నిర్వహించాలని సూచించారు.  ఈ ఉత్సవాలను పర్యవేక్షించాలని మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Also Read..

కేసీఆర్ కు ఊహించని షాక్! 

30 వేల ఎకరాలు అమ్మకానికి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Tags:    

Similar News