Sama Rammohan: బీజేపీ టాస్క్ పూర్తి చేయ‌డానికే ఢిల్లీకి కేటీఆర్: సామ రామ్మోహన్ రెడ్డి

కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత ఘాటు విమర్శలు చేశారు.

Update: 2024-11-18 05:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారుతున్నది. ఇవాళ ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇదే నెలలో కేటీఆర్ కు ఇది ఢిల్లీకి రెండో పర్యటన కావడంతో కేటీఆర్ టూర్లపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేటీఆర్ బీజేపీకి అద్దె మైక్ అంటూ తాజాగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఢిల్లీ టూర్ పై సామ స్పందిస్తూ కాంగ్రెస్ ను బద్నాం చేయాలని బీజేపీ (BJP) ఇచ్చిన టాక్స్ ను పూర్తి చేయడానికే కేటీఆర్ ఢిల్లీ బయలుదేరారని విమర్శించారు. కేటీఆర్ నీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని మూటలు ఢిల్లీకి తీసుకెళ్తున్నావ్ అని ప్రశ్నించారు.

అందుకోసమే నీ హడావుడి:

ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియబోతున్నదని అందుకే ఒక గంట ముందు ఢిల్లీలో జాతీయ మీడియాతో హడావుడి ప్రెస్ మీట్ అన్నారు. నువ్వు నీ బీజేపీ బీ టీమ్ వేశాలు అందరికీ తెలుసని మండిపడ్డారు. నీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ అప్రతిష్టపాలు చేసే కుట్రలు చేస్తున్న తెలంగాణ ద్రోహివి అని దుయ్యబట్టారు. నీ బాధ ప్రపంచ బాధ కాదని అంగ‌న్ వాడీ చిన్నారుల‌కు కొత్త యూనిఫాంలు మొద‌లుకుని.. అన్నదాతలకు బోన‌స్ దాకా అన్ని వ‌ర్గాల ప్రజలకు ప్రజా ప్రభుత్వం ల‌బ్ది చేకూర్చుతుందన్నారు. నిరుద్యోగ భృతి, ప్రతి వ్యక్తికి హెల్త్ ప్రొఫైల్స్, బయ్యారంలో సొంతంగా ఉక్కు ఫ్యాక్టరీ, ఇలా నువ్వు ప్రజలకు చేసిన మోసాలను ఢిల్లీ వేదికగా చెప్పాలన్నారు. నేరేళ్ల ద‌ళితుల‌ను లారీల‌తో తొక్కి చంపి, ప్రశ్నిస్తే సంసారానికి ప‌నికి రాకుండా కొట్టి, ఖ‌మ్మం గిరిజ‌న రైతుల‌కు బేడీలు వేసి, బాలింత‌ల‌ను జైల్లో పెట్టిన కృూర పాల‌న మీదని దీని మీద ఢిల్లీ మీడియాకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News