పాల్వాయి స్రవంతిని కలవడంపై సీఎం KCR క్లారిటీ
సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆకలి దేశంగా మారుతోందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోందని,
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆకలి దేశంగా మారుతోందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోందని, దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితిలు నెలకొన్నాయి. ఇది చాలా బాధకరమైనది అన్నారు. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అన్నిరంగాల్లో సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు. అలాగే మునుగోడులో సిగ్గుపడే పరిస్థితి తయారైందని, పాల్వాయి స్రవంతి నన్ను కలిసినట్లుగా దుష్ప్రచారం చేశారంటూ తెలిపారు. రాజకీయాలలో గెలుపోటములు సహజం, దుబ్బాక, హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోయింది, నాగార్జున్ సాగర్, హుజుర్‌నగర్‌లో మేము గెలిచాం అన్నారు. అలాగే, ఛీప్ ఎలక్ష్‌న్ కమీషనర్ విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ఈసీ వారికి అనుకూలంగా పనిచేయాలా? ఇంత దిగజారడం అవసరమా, అసలు ఈ రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందన్నారు.