రేవంత్ రెడ్డి​పాదయాత్రకు భద్రత ఇవ్వట్లే: కాంగ్రెస్

రేవంత్​పాదయాత్రకు ప్రభుత్వం భద్రతను ఇవ్వకపోవడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నదని కాంగ్రెస్​నేతలు ఫైర్​అయ్యారు.

Update: 2023-03-04 16:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్​పాదయాత్రకు ప్రభుత్వం భద్రతను ఇవ్వకపోవడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నదని కాంగ్రెస్​నేతలు ఫైర్​అయ్యారు. హై కోర్టు చెప్పినా, సర్కార్​తీరు మారలేదని విమర్శించారు. శనివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని ఆరోపించారు. ప్రజల సొమ్మును కొంతమంది పెద్దలకు బీజేపీ పంచి పెట్టిన విషయాన్ని రాహుల్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలకు‌ చాటి చెప్పారన్నారు.

దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తున్నదన్నారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు తిన్నారని, కానీ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదన్నారు. ప్రాజెక్టుకు కాల్వలు తవ్వకుండా నీళ్లు ఎట్ల ఇస్తరు? అని భట్టి ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలవడానికి ఉపయోగపడేది డోర్ టూ డోర్ క్యాంపెయిన్ మాత్రమేనని ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ జోడో యాత్రకు వస్తున్న మద్దతు చూసి బీఆర్ఎస్​ ప్రభుత్వం బెంబేలెత్తిపోతుందని వీహెచ్, అద్దంకి దయాకర్​అన్నారు. యాత్రపై దాడులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్​పోరాటం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

Tags:    

Similar News