ల్యాబ్ టెక్నీషియన్లకు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసిన ఉత్తర్వులు కాపీలను మంత్రి హరీష్ రావు అందజేశారు.

Update: 2023-05-04 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసిన ఉత్తర్వులు కాపీలను మంత్రి హరీష్ రావు అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్లకు క్రమబద్దీకరణ ఉత్వర్వుల కాపీలను అందజేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపి ఆత్మగౌరవంతో జీవించేలా మరింత మెరుగైన సేవలను తెలంగాణా ప్రజలకు అందించేలా సూచించారు.

ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలుపులేకపోయాయని, తెలంగాణ ఏర్పడ్డాక అక్కున చేర్చుకున్న ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి.హరినాథ్, మంచాల రవిందర్, కోశాధికారి రాజేందర్, రాష్ట్ర బాధ్యులు ఆఫ్తాబ్ అహ్మద్ లు శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు పొందుతున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News