రాష్ట్ర రైతులకు సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ శుభవార్త

రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలియజేశారు.

Update: 2023-05-11 14:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలియజేశారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గురువారం నిజాంపేట్ డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ స్థానిక శాసన సభ్యుడు భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరికొనుగొలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని ఆకస్మికంగా సర్దార్ రవీందర్ సింగ్ పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అప్పటికప్పుడే నిజాంపేట్ గ్రామంలోని శ్రీసాయి గణేష్ బిన్నీ రైస్ మిల్లుకి పంపడానికి అనుమతి ఇవ్వాలని స్థానిక నాయకులు కోరగా వెంటనే సంబంధిత అధికారులైన డీఎం సుగుణ బాయ్, డీఎస్ఓ వనజ, రైస్ మిల్లు యజమానికి ఆదేశాలు జారీ చేశారు. దీని పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. డీసీఎంఎస్ సిబ్బంది అయినటువంటి స్వప్న, యాదగిరిలను జిల్లాలోనే అతిపెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సమస్యలు లేకుండా నడుపుతున్నందుకు అభినందించారు. సందర్శించినప్పుడు రైతు పెంటయ్య ధాన్యం తూకం అవుతుండగా అప్పటికప్పుడు పెంటయ్యకు రైతు కొనుగోలు పత్రాన్ని స్వయంగా అందజేశారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తూ రైతుల ఇబ్బందులను తెలుసుకొని తగు సూచనలు జారీ చేస్తున్నామని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. చైర్మన్ వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, రైతులు ఉన్నారు.

Tags:    

Similar News