CM Revanth: ధరణి బాధితులకు గుడ్ న్యూస్.. పకడ్బందీగా ప్లాన్ చేస్తోన్న సర్కార్

ధరణి పోర్టల్‌పై రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-07-26 12:28 GMT
CM Revanth: ధరణి బాధితులకు గుడ్ న్యూస్.. పకడ్బందీగా ప్లాన్ చేస్తోన్న సర్కార్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్‌పై రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఈ అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరపాలని నిర్ణయానికి వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అంతేకాదు.. సవరణల్లో కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తప్పకుండా సవరణల్లోపైనా ప్రజల అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వీలైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాలని తెలిపారు. కాగా, బడ్జెట్‌ ప్రపంగంలో ధరణిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ధరణి నిజమైన భూ యజమానులకు సొంత భూమిని దూరం చేసిందని ఆరోపించారు. ధరణి వల్ల లక్షలాది మంది రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. కుటుంబ అవసరాల కోసం తన భూమిని తాను అమ్ముకోలేక అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ధరణి పోర్టల్‌లోని లోపాలను హైకోర్టు కూడా ఎత్తిచూపిందని గుర్తుచేశారు.

Tags:    

Similar News