తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నా: CM రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

Update: 2024-03-08 04:41 GMT
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నా: CM రేవంత్ రెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ పరమ శివుడ్ని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఉపవాస పూజలు చేస్తున్న భక్తులకు మహాశివుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. కాగా, మహా శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిపోయాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, టెంట్లతోపాటు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News