MLC Kavitha : ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు : కవిత
సమగ్ర శిక్షా అభియాన్(Samagra Shiksha Abhiyan) ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్ : సమగ్ర శిక్షా అభియాన్(Samagra Shiksha Abhiyan) ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించం లేదని మండిపడ్డారు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని అనడం హాస్యాస్పదం అన్నారు. ఇలాగే నిరసనలు కొనసాగిస్తే, సమస్య తీవ్రమవుతుందని బెదిరింపు దోరణిలో మాట్లాడుతుండటాన్ని తాను ఖండిస్తున్నానని వెల్లడించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని కవిత హామీ ఇచ్చారు.