నేడు చంద్రయాన్ -3 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్

నేడు చంద్రయాన్ -3 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

Update: 2023-07-13 03:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు చంద్రయాన్ -3 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్ డౌన్ ను అధికారులు ప్రారంభించనున్నారు. చంద్రయాన్ -3 కి 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 2.35 గంటలకు ఏపీలోని శ్రీహరి కోట నుంచి నింగిలోకి ఎల్ వీఎం - 3పీ4 దూసుకెళ్లనుంది.

శ్రీహరికోటలోని షార్ కు ఇప్పటికే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చేరుకున్నారు. 24 గంటల లాంచ్ రిహార్సల్ పూర్తయిందని ఇస్రో బుధవారం ట్వీట్ చేసింది. చంద్రయాన్ -3 చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, కక్ష్యలో పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. చంద్రయాన్ -3 రాకెట్‌ను భారీ పేలోడ్ సామర్థ్యం కారణంగా ఇస్రో సైంటిస్ట్‌లు ఫ్యాట్ బాయ్ అని పిలుస్తున్నారు. కాగా 3,900 కిలోల బరువు వుండే చంద్రయాన్ -3 బడ్జెట్ అంచనా రూ.613 కోట్లు.

Tags:    

Similar News