Ruby Lodge: రూబీ లాడ్జీ ఘటనలో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి కేంద్ర శాఖ
దిశ, డైనమిక్ బ్యూరో : సికింద్రాబాద్ రూబీ లాడ్జి ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుశాఖ..
దిశ, డైనమిక్ బ్యూరో : సికింద్రాబాద్ రూబీ లాడ్జి ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుశాఖ ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేసింది. బ్యాటరీ పేలుళ్లే ప్రమాదానికి కారణమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు కేంద్ర రవాణా శాఖ రంగంలోకి దిగింది. ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది. ఈ రోజు బైక్ పేలుళ్లపై విచారణ జరగనుంది. బ్యాటరీలు పేలడానికి కారణాలు, సరైన జాగ్రత్తలు తీసుకోలేదా అనే కోణంలో విచారణ జరగనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలిన ఘటనపై కేంద్ర రవాణా శాఖ అప్రమత్తమైంది.
కాగా, సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూబి లాడ్జి యజమాని రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడిని, లాడ్జి సూపర్‌వైజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్‌బాగ్‌లో బంధువుల ఇంట్లో తలదాచుకున్న తండ్రి, కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.