భారతీయ సంస్కృతికి ప్రతీకలు కేంద్రీయ విద్యాలయాలు : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
భిన్నత్వంలో ఏకత్వానికి నెలవైన భారత దేశపు సంస్కృతికి ప్రతీకలుగా, మినీ భారత్ గా కేంద్రీయ విద్యాలయాలు(Central schools)కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్ : భిన్నత్వంలో ఏకత్వానికి నెలవైన భారత దేశపు సంస్కృతికి ప్రతీకలుగా, మినీ భారత్ గా కేంద్రీయ విద్యాలయాలు(Central schools)కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. పికెట్ కేంద్రీయ విద్యాలయలో జరిగిన ‘రాష్ట్రీయ ఏక్తా పర్వ్’ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి వివిధ మాతృభాషల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారని, కేంద్రీయ విద్యాలయం కేవలం పాఠశాల మాత్రమే కాదని, జ్ఞానాన్ని ప్రసాదించే ఓ దేవాలయం, ఓ సంఘం లాంటిందని కొనియాడారు. విలువలతో పాటు ప్రతిభ ఆధారంగా విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడంలో దేశంలోనే కేంద్రియ విద్యాలయాలు అత్యుత్తమమైనవన్నారు. ఈ సందర్బంగా ఆట పాటలతో అలరించిన చిన్నారులను అభినందిస్తున్నానన్నారు. ఈ రోజు, 'కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఏక్తా పర్వ్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు విద్యార్థుల సృజనాత్మక, కళలు, ప్రతిభను వెలికి తీస్తూ రాష్ట్ర ఏక్తా పర్వ్ ద్వారా వైవిధ్యమైన దేశ సాంస్కృతిక వైభవాన్ని పెంపోందించడం అభినందనీయమన్నారు. భిన్నత్వం ఉన్నప్పటికీ ఈ సంస్కృతి దేశాన్ని ఏకతాటిపై నిలిపిందని, ఈ ప్రాచీన విలువలను అలవర్చుకుని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలిపేందుకు ఒక దార్శనికతను రూపొందిస్తున్న ఈ తరుణంలో సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడంలో ముందుకు తీసుకెళ్లే విషయంలో యువత విద్యార్థుల పాత్ర ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు యువతే మన గొప్ప బలం అని నేను నమ్ముతున్నానని, మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం యువత కలలను సాకారం చేసేందుకు ఎనలేని కృషి చేస్తోందని తెపిపారు. ప్రతి విద్యార్థి కలను వారి సామర్థ్యాన్ని నెరవేర్చే ఆలోచనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) యొక్క లక్ష్యమని తెలిపారు. ఈవిధానంలో అనుభవం-ఆధారిత అభ్యాసంతో పాటు క్రీడలు కళలు, సంస్కృతి మరియు జాతీయ భావాన్ని సమాజ స్ఫూర్తిని పెంపోందించే పెద్ద లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడనుందని వివరించారు. క్రీడల ఆధారిత అభ్యాసంతో కూడిన విద్య , క్రీడలు, కళలు, చేతిపనులు మరియు అన్ని ఇతర సృజనాత్మను పెంపోందించడం ద్వారా పిల్లల ప్రతిభ మరియు నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని 21వ శతాబ్దపు నాయకులుగా తీర్చిదిద్ది సర్వతోముఖాభివృద్ధికి దోహద పడుతుందన్నారు. తద్వారా ఆత్మ నిర్భర్ భారత్‌ను నిర్మించడంలో వారు కీలక పాత్ర పోషించే దిశగా యువశక్తిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.