MLC కవిత నివాసం వద్ద సంబరాలు.. ఎందుకో తెలుసా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం

Update: 2025-03-18 16:37 GMT
MLC కవిత నివాసం వద్ద సంబరాలు.. ఎందుకో తెలుసా?
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేరువేరు బిల్లులను పెట్టిందని యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివ శంకర్ తెలిపారు. కవిత ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. రెండు బిల్స్ పెట్టడంపై మంగళవారం ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద యూనిటైడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు సంబరాలు జరిపారు. సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్నిరకాల అన్యాయాలకు గురైన బీసీ సోదరులకు రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను ప్రవేశ పెట్టడం స్వాగతిస్తున్నామని తెలిపారు.

బీసీల సంఖ్య తక్కువగా చూపిట్టినప్పటికీ బీసీ సంఘాలు, పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి వంటి సంస్థల ఒత్తిడితోనే బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయని అన్నారు. బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వీ మహేంద్ర, గోప సదానందం, కొట్టాల యాదగిరి, హమాలీ శ్రీను, విజేందర్ సాగర్, ఏల్చాల దత్తాత్రేయ, నరహరి, నరేష్, కుమార స్వామి, ప్రవీణ్, లింగం, అశోక్, మేకల లలిత యాదవ్, పావని గౌడ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News