మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డిపై కేసు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన హైడ్రా.. మహానగరంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతొంది.

Update: 2024-09-08 11:00 GMT

దిశ. వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన హైడ్రా.. మహానగరంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతొంది. చెరువు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారికి ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు మాత్రం భయపడటం లేదు. ఎఫ్ టీఎస్ పరిధిలో ఎటువంటి నిర్మాణం ఉన్నప్పటికి నోటీసులు జారీ చేయడం.. కూల్చివేయడం తమ పనిగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అమీన్ పూర్ లోని వాణి నగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పై కేసు నమోదైంది. ఈ రోజు తెల్లవారుజామున భారీ బందోబస్తు నడుమ.. మాజీ ఎమ్మెల్యే కు చెందిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. అలాగే కూల్చివేతల సమయంలో అడ్డం పడిన విజయలక్ష్మి పై కూడా కేసు నమోదు చేశారు. విజయ లక్ష్మీ మల్లంపేట చెరువులో విల్లాలను నిర్మించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంది ఆదివారం సాయంత్రం తాను ఎటువంటి అక్రమ కట్టడాలు చేపట్టలేదని.. అసలు తనకు హైదరాబాద్‌లో ఎటువంటి బిల్డింగులు లేవని చెప్పుకొచ్చారు.


Similar News