కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది.

Update: 2023-02-24 09:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం సమావేశమైన వెరిడ్ బోర్డు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సమావేశంలో డీలిమిటేషన్‌పై వాడివేడి చర్చకు నామినేట్ సభ్యుడు రామకృష్ణ లెవనేత్తగా చివరికి గతనాటిలాగే ఎన్నికలు కొనసాగుతయంటూ అధికారులు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. మార్చి 1 నుంచి 4 వ తేదీ వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 4వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 6వ తేదీన ఓటర్ లిస్ట్‌పై అబ్జెక్షన్స్ ఉంటే చెప్పాలని బోర్డు తెలిపింది.

మార్చి 23వ తేదిన ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. ఇక 28,29 తేదిల్లో నామినేషన్‌ల గట్టం మొదలవుతుంది. మార్చి 29న లిస్టు సిద్దం అవుతుంది. ఏప్రిల్ 1వ తేదిన స్కూటిని ఉండనుండగా..ఏప్రిల్ 6వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రాలకు అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన సింబల్స్ కేటాయింపు జరగుతుంది. అనంతరం అనాటి నుంచి మొదలైన ఎన్నికల ప్రచారం దాదాపసు 20 రోజుల పాటు సాగనుంది. ఇక ఏప్రిల్ 30వ తేదిన ఎన్నికలు జరగనున్నట్లు బ్రిగెడియర్ సోమశంకర్‌తో పాటు సీఈఓ మధుకర్ నాయక్‌లు స్పష్టం చేశారు. అభ్యంతరాలు ఉంటే చెప్పాలని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కోరారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..