కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో 78 రైళ్ల రద్దు.. కారణమిదే..!

కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో 78 రైళ్లను రద్దు చేశారు.

Update: 2024-06-26 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో 78 రైళ్లను రద్దు చేశారు. 26 ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. ఆసిఫాబాద్-రేచ్ని మూడో లైను నిర్మాణం కారణంగా ‌రైళ్లను రద్దు చేశారు.

రద్దయిన రైళ్ల వివరాలు ఇలా..

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - జూన్ 26 నుంచి జులై వరకు రద్దయ్యాయి. హైదరాబాద్- గోరఖ్ పూర్ (నంబర్ 02575) జూన్ 28న, గోరఖ్ పూర్-హైదరాబాద్ (నంబర్ 05303) ఎక్స్ ప్రెస్ ట్రైన్ జులై 30న రద్దయ్యాయి.

పుణె-కాజీపేట ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 22151) ఈ నెల 28న, జులై 5న, కాజీపేట-పుణె‌ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 22152) జూన్ 30, జులై 7న రద్దయ్యాయి.

సికింద్రాబాద్-రాక్సల్ మధ్య తిరిగే మూడు రైళ్లు.. జూన్ 26, 27, 28 తేదీల్లో రద్దయ్యాయి.

సికింద్రాబాద్-దానాపూర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్ 27, 28,29, జులై 1 తేదీల్లో రద్దయ్యాయి. సికింద్రాబాద్-సుభేదార్ గంజ్ మధ్య తిరిగే రైళ్లు జూన్ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.

ముజఫర్‌పూర్‌-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 05293) జులై 2న, సికింద్రాబాద్-ముజఫర్ పుర్ (ట్రైన్ నంబర్ 05294) జూన్ 27, జులై 4న రద్దయ్యాయి.

గోరఖ్ పూర్- జడ్చర్ల (ట్రైన్ నంబర్ 05303) రైలు జూన్ 29న, జడ్చర్ల-గోరఖ్‌పూర్ (ట్రైన్ నంబర్ 05304) రైళ్లు జులై 1న రద్దయ్యాయి.


Similar News