నగరంలో విస్తరించిన ‘‘కాల్ బాయ్స్’’ కల్చర్.. 19 నుండి 25 ఏళ్ల యువకులకు ఫుల్ డిమాండ్!
హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా కొద్దీ వింత పోకడలు, వింతైన అలవాట్లు అదే స్థాయిలో వచ్చిపడుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా కొద్దీ వింత పోకడలు, వింతైన అలవాట్లు అదే స్థాయిలో వచ్చిపడుతున్నాయి. ఈ మధ్య సిటీలో మేల్ ఎస్కార్ట్స్ కల్చర్ విస్తృతంగా పెరిగింది. భర్తలు దూరంగా లేదా బిజీగా ఉండడం, పెళ్లి చేసుకోవాలనే ఇంట్రస్ట్ లేని మహిళలు, విడోస్ ‘కాల్ బాయ్స్’ పట్ల ఇంట్రస్ట్ చూపుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్, రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్, సాఫ్ట్ వేర్, సినిమా రంగాల్లోని మహిళలు ఈ సర్వీసును తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కారణాలనేకం..
ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో బిజినెస్ కుటుంబాల్లోని భర్తలు బిజీగా ఉంటున్నారు. దీంతో భార్యలకు సమయమివ్వలేకపోతున్నారు. వేరువేరు నగరాల్లో పని చేయాల్సి రావడంతో టెకీ దంపతులు నెలల కొద్దీ దూరంగా ఉంటున్నారు. దాంపత్య సుఖానికి దూరంగా ఉంటున్న ఇలాంటి వారే మేల్ ఎస్కార్ట్ సర్వీసులను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీంతో పాటు కొత్త టేస్ట్ కోసం కొందరు లేడీస్ ఎంజాయ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. చాలా మంది తమ కంటే చిన్న వయసున్న కాల్ బాయ్స్ ను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా విడోస్, పెళ్లి కాని వారు సైతం మేల్ ఎస్కార్ట్ సేవలను బుక్ చేసుకుంటున్నారు.
పెళ్లితో చికాకులు ఎందుకని..
ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోడానికి ఇష్టపడటం లేదు. పిల్లలు, కుటుంబం, ఇతర బాధ్యతలు మోయాల్సి వస్తుందని జంకుతున్నారు. అయితే సెక్స్‌ను ఎంజాయ్ చేసేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. మేల్ ఎస్కార్ట్స్ సర్వీసెస్ ద్వారా బాయ్‌ను రప్పించుకుంటున్నారు. అన్ని రకాల సెఫ్టీ మెజర్స్‌తో రావాలని ముందుగానే అలర్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.
అంతా సీక్రెట్ గానే..
మేల్ ఎస్కార్ట్స్ సర్వీసెస్ అంతా సీక్రెట్‌గానే జరుగుతుండడంతో మహిళల్లో దీని పట్ల నమ్మకం పెరిగిపోతున్నది. సర్వీస్ ఇచ్చిన పురుషుడు ఎవరో తెలియదు. ఎక్కడ ఉంటారో తెలియదు. అతను కోరినంత డబ్బు చెల్లిస్తుంటారు అంతే. అతను మళ్లీ వచ్చే చాన్స్ ఉండదు. వివాహేతర సంబంధాలతో ఎన్నో ఇబ్బందులు ఎదురవడంతో పాటు పరువు పోతుందనే భయముంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో హత్యలు, ఆత్మహత్యలు సైతం జరిగిన ఘటనలు ఉన్నాయి. దీని కంటే మేల్ ఎస్కార్ట్స్ మంచి ఆప్షన్ అని మహిళలు భావిస్తున్నట్టున్నారు.
ఆన్ లైన్ లోనే బుకింగ్
బాయ్స్ బుకింగ్ అంతా ఆన్ లైన్‌లోనే జరుగుతున్నది. వెబ్ సైట్, సోషల్ మీడియా, యాప్స్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. క్లయింట్ కోరిన టైమ్, ప్లేస్‌కు బాయ్స్ వెళ్తున్నారా? లేదా? అని వాట్సప్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. గంటపాటు టైమ్ స్పెండ్ చేస్తే రూ. 5వేలు, రెండు గంటలకు రూ.7 వేల వరకు చార్జ్ చేస్తున్నారు. డే టైమ్కు రూ. 10 వేలు, నైట్ టైమ్ కు 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొందరు రిచ్ లేడీస్ తమ కిట్టి పార్టీలకు ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలను బుక్ చేసుకుని ఫామ్ హౌజ్‌కు సైతం తీసుకెళ్తున్నట్లు తెలుస్తున్నది.
చాయిస్ ఆప్షన్..
మేల్ ఎస్కార్ట్స్ సర్వీస్‌లో లేడీస్ తమకు ఇష్టమైన బాయ్స్‌ను బుక్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. బాయ్స్ పూర్తి డేటాను ఆన్ లైన్ లో పెడతారు. ఏజ్, ఎడ్యుకేషన్, కలర్, హైట్ లాంటి వివరాలను సర్వీస్ కోరుకుంటున్న లేడీస్‌కు పంపుతారు. లోకల్, నాన్ లోకల్ లాంటి వివరాలను కూడా వెల్లడిస్తారు. తెలుగు లేడీస్ ఎక్కువగా నార్త్ అబ్బాయిలు, నాన్ తెలుగు లేడీస్ తెలుగు బాయ్స్ కావాలని అడుగుతుంటారని సర్వీస్ ప్రొవైడర్లలో పని చేస్తున్న ఓ మేనేజర్ తెలిపారు.
19-25 ఏళ్ల వారికి ఫుల్ డిమాండ్
మేల్ ఎస్కార్ట్స్ ద్వారా సర్వీస్ కావాలని అడుగుతున్న మహిళలు ఎక్కువగా 19 నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాయ్స్‌ను ఎక్కువగా అడుగుతున్నట్టు తెలుస్తున్నది. సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న బాయ్స్‌కు కాస్త ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు సమాచారం. ఇంకొందరైతే ట్రెండ్‌కు తగ్గట్టుగా హీరోల మాదిరిగా హెయిర్ స్టయిల్, గడ్డం సైతం ఉండే బాయ్స్ కావాలని కండీషన్లు పెడుతున్నట్లు పెడుతున్నారని ప్రొవైడర్లు చెబుతున్నారు.
చెప్పినట్లు వినకుంటే..
మేల్ ఎస్కార్ట్స్ సర్వీసులో బుక్ చేసుకునే బాయ్స్‌కు క్లయింట్స్ గురించి వివరాలేమీ తెలియనివ్వరు. బుక్ చేసుకున్న టైమ్‌కు రావడం, క్లయింట్ కోరినట్టు సర్వీస్ ఇవ్వడానికి మాత్రమే వారు పరిమితమవుతారు. ఎట్టి పరిస్థితుల్లో గీత దాటరు. ఎందుకంటే క్లయింట్ నుంచి కంప్లయింట్ వస్తే.. అలాంటి బాయ్స్‌కు సర్వీస్ ప్రొవైడర్స్ మళ్లీ కొత్త అపాయింట్మెంట్ ఇవ్వరు. దీంతో బాయ్స్ కంపెనీ రూల్స్ ను కచ్చితంగా ఫాలో అవుతుంటారు.
బాడీ మెయింటెన్స్ ఖర్చు ఎక్కువే
మేల్ ఎస్కార్ట్స్ సర్వీస్ ఇస్తున్న అబ్బాయిల బాడీ మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా జిమ్ కు వెళ్లడం, యాక్టివ్‌గా, అలసిపోకుండా ఉండేందుకు స్పెషల్ ఫుడ్ తీసుకుంటుంటారు. ఇందుకోసం ప్రతినెల రూ. 15 నుంచి 20 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని కాల్ బాయ్స్ చెబుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్లు ఫీజులో 40 నుంచి 50 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుంటారు. అయితే కొందరు మహిళలు తాము కోరుకున్నట్టుగా సర్వీస్ చేసినందుకు నాలుగైదు వేల వరకు టిప్ కూడా ఇస్తుంటారని కాల్ బాయ్స్ చెబుతున్నారు.
పార్ట్ టైమ్‌గా పనిచేస్తున్న
- మేల్ ఎస్కార్ట్ గా పని చేస్తున్న ఓ తెలుగు వ్యక్తి
హోటల్ మేనేజ్మెంట్‌లో డిగ్రీ చేశారు. ఓ హోటల్ చెఫ్‌గా వర్క్ చేస్తున్నాను. అనుకున్నంత శాలరీ రావట్లేదు. దీంతో తెలిసిన ఓ ఫ్రెండ్ ద్వారా మేల్ ఎస్కార్ట్‌గా మారాను. పార్ట్ టైమ్ పని చేస్తున్నాను. నా వయస్సు ఇప్పుడు 23. ఈ వర్క్ కేవలం రెండు మూడేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ లోపు ఎంతో కొంత సంపాదించుకోవాలి.
నేను కూడా టెకీనే
- నార్త్ మేల్ ఎస్కార్ట్
నేను గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నారు. కాని అదనపు సంపాదన, ఓ ప్యాషన్ కోసం ఎస్కార్ట్‌గా మారాను. నాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది. డే టైమ్ లో సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన అపాయింట్మెంట్‌కు అటెండ్ అవుతాను. వారంలో ఇద్దరి నుంచి ముగ్గురికి సర్వీస్ ఇస్తుంటాను.
ఫుల్ డిమాండ్ ఉన్నది - సర్వీస్ ప్రొవైడర్ మేనేజర్
సిటీలో ఈ మధ్య మేల్ ఎస్కార్ట్‌కు డిమాండ్ పెరిగింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి నుంచి ఎక్కువగా బుకింగ్స్ వస్తాయి. అప్పుడప్పుడు సికింద్రాబాద్, బేగం పేట ప్రాంతాల నుంచి కూడా వస్తుంటాయి. అయితే పోలీసులు ఆన్ లైన్‌లో తాము పెట్టిన ఫోన్ నెంబర్లకు ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. వెంటనే వారిని కలిసి ఎంతో కొంత సమర్పించుకుంటాం.
ఈ కల్చర్‌ను కట్టడి చేయాలి -రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్
చాలా ఏళ్లుగా సిటీలో కాల్ బాయ్స్ కల్చర్ నడుస్తున్నది. ఇప్పుడు మరింత పెరిగింది. గతంలో ఇలాంటి సర్వీసు ఇచ్చే బ్రోకర్లను పిలిచి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇష్టపూర్వకంగా జరిగే సెక్స్ తప్పుకాదని కోర్టు తీర్పులు ఉన్నాయి. అయినా పోలీసులు మేల్, ఫిమేల్ ఎస్కార్ట్స్ సర్వీస్ ప్రొవైడర్ల కదలికలను గమనించి, కట్టడి చేసేందుకు ప్రయత్నించాలి.