Reservoirs Cabinet Sub Committee : తెలంగాణలో ‘రిజర్వాయర్ల’పై కేబినెట్ సబ్ కమిటీ
రాష్ట్రంలోని రిజర్వాయర్ల నిల్వ, సామర్థ్యం, పునరుద్ధరణపై కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని రిజర్వాయర్ల నిల్వ, సామర్థ్యం, పునరుద్ధరణపై కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరులు, నదుల అభివృద్ధి గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్‌వర్క్‌పై పద్ధతులు, మార్గదర్శకాలను అధ్యయనం, సిఫార్సు చేయడానికి ఈ మంత్రివర్గ ఉప సంఘం పని చేయనుంది.
ఈ కమిటీకి చైర్మన్‌గా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సభ్యులుగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావులను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ కన్వీనర్, సభ్యుడిగా ఇరిగేషన్ శాఖ కార్యదర్శిని నియమించింది. ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులను సమర్పించాలి.