Cabinet Sub Committee: నిధుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

నిధుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.

Update: 2024-11-04 09:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆ దిశగా అవసరమైన చర్యలకు కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై సోమవారం మంత్రివర్గ ఉపసంఘం (TG Cabinet Sub Committee) సమావేశమైంది. సచివాలయంలో (TG Secretariat) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన భేటీ అయింది. ఈ మీటింగ్ లో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖజానాకు అదనపు నిధుల సమీకరణపై ఈ సమావేశంలో చర్చించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పాత అప్పులను తీర్చేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో కొత్త అప్పులను తగ్గించుకునేందుకు ఆదాయం సమకూర్చుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో నిధుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.

Tags:    

Similar News