Cabinet Meeting: ఈ నెల 20న కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.

Update: 2024-09-14 08:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: సచివాలయంలో ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే, ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై చర్చ జరగనుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారంపై చర్చించనున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు చేయాల్సిన కసరత్తుపై డిస్కస్ చేయనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌లో మార్పులపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ‘హైడ్రా’కు చట్టబద్ధత, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ పరిధిలో బిల్డింగ్ పర్మీషన్ల ఎన్‌వోసీ జారీలో హైడ్రాను భాగస్వామి చేయడం వంటి విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకం అమలు విధివిధానాలు, కొత్త రేషన్ కార్డులపై కేబినెట్‌లో చర్చించనున్నారు. 


Similar News