వ్యక్తిగత వాహనాలతో వ్యాపారం.. కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా మంత్రికి విజ్ఞప్తి

వ్యక్తిగత వాహనాలతో వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఇవాళ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-01-10 15:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యక్తిగత వాహనాలతో వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఇవాళ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత వాహనాలలో ప్యాసింజర్లను ఇతర ప్రాంతాలకు చేరవేస్తూ.. వ్యాపారం చేయడం వల్ల రాష్ట్ర రవాణా శాఖకు, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్లకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని తెలిపారు. స్వయం ఉపాధితో బ్రతుకుతున్న టాక్సీ డ్రైవర్లు వ్యాపారం లేక, రోడ్ టాక్స్ కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేని దుస్థితికి చేరుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగరంలో ఎల్‌బీ నగర్, ఉప్పల్, జూబ్లీ బస్టాండ్, లింగంపల్లి, శంషాబాద్ ఓఆర్ఆర్ ఆరంగర్ చౌరస్తా‌లో అలాంటి వ్యాపారం అధికంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సొంత వాహనాలలో ప్యాసింజర్లను ఇతర ప్రాంతాలకు చేరుస్తూ.. రవాణా శాఖకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై సత్వరమే మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సల్లావుద్దీన్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.

Tags:    

Similar News