బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. కండక్టర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడం.. పరిస్థితిని గుర్తించిన కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది.
దిశ, మహబూబ్ నగర్: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడం.. పరిస్థితిని గుర్తించిన కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. సోమవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సు హైదరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణం అయింది. బస్సు పాలమూరు పట్టణంలోని పిస్తా హౌస్ వద్దకు రాగానే డ్రైవర్ ఎనుమప్పకు గుండెపోటు రావడం... సీటు నుండి పక్కకు పడిపోతుండడంతో విషయం గుర్తించిన కండక్టర్ జోగి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సు బ్రేకులు వేసి ఆపాడు. డ్రైవర్ గుండెపోటుతో పరిస్థితి విషమించుతున్న నేపథ్యంలో కండక్టర్ జోగి డ్రైవర్‌గా మారి బస్సును జిల్లా ఆసుపత్రిలోకి తీసుకువెళ్లాడు.. డ్రైవర్ వైద్య సేవలు పొందుతూ ప్రాణాలు వదిలాడు.. తమ ప్రాణాలకు ప్రమాదం జరగకుండా కాపాడిన కండక్టర్‌కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపి.. డ్రైవర్ మృతి చెందడం పట్ల దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.