కేసీఆర్ జర్నలిస్టులను కూడా మోసం చేశారు.. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్

సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని జర్నలిస్టులను కూడా మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Update: 2023-05-18 09:39 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని జర్నలిస్టులను కూడా మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 2014 మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు, అక్రడియేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ పదేళ్లు కావొస్తున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో అన్ని హంగులతో జర్నలిస్ట్ భవన్ కడుతానని కేసీఆర్ చెప్పిన మాటలు అన్ని అబద్ధాలనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూప.10 కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి కావాలనే మర్చిపోయారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వార్తలు రాస్తే జర్నలిస్టులపై బెదిరింపులకు దిగుతున్నారని, మేనేజ్ మెంట్ కు ఫోన్లు చేసి ఉద్యోగాలు పీకేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను వేధిస్తూ.. జిల్లాల్లో వాళ్లకు కేటాయించిన భూములను ప్రభుత్వం లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఆహ్వానం పంపుతూ మిగతా వారిని పిలవడం లేదన్న ఆయన.. కేసీఆర్ కు నచ్చిన వార్తా సంస్థలకే ప్రభుత్వం తరఫున యాడ్స్ ఇస్తున్నారని ఆరోపించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు.

కమీషన్లు రావనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వట్లే: కేసీఆర్‌పై షర్మిల ఫైర్ 

Tags:    

Similar News