బీఆర్ఎస్ వాట్ నెక్ట్స్.. కర్ణాటక రిజల్ట్స్‌తో సీన్ రివర్స్!

కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని హంగ్ ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ భావించారు.

Update: 2023-05-13 08:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని హంగ్ ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ భావించారు. కానీ ఫలితాలు ఊహించిన దానికి రివర్స్ అయ్యాయి. పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించింది. దీంతో జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం లేకుండా పోయింది. కేసీఆర్ అంచనాలు తారు మారు అయ్యాయి. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం పై కమిషన్ల ఆరోపణలు.. కాంగ్రెస్ సైతం దేశంలో ఉనికి కోల్పోయిందని... కర్ణాటకలో సైతం గెలిచే అవకాశం లేదని... జెడిఎస్ కు కలిసి వస్తుందని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని... కుమారస్వామిని సీఎం అవుతారని కెసిఆర్ భావించారు.

పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నప్పటికీ ప్రచారం చేయలేదు. అయితే జెడిఎస్ కింగ్ మేకర్ అవుతుందని భావించారు. కుమార స్వామికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అయితే కర్ణాటకలో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్ చతికలపడింది. గతం కంటే జేడీఎస్‌కు సీట్లు తక్కువ వచ్చాయి. సుమారు 10 సీట్లు తగ్గడం... హంగ్ వచ్చే అవకాశం లేకపోవడంతో కేసీఆర్ డైలమాలో పడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్న గులాబీ బాస్‌కు ఇది మింగుడు పడడం లేదు. జాతీయ పార్టీ విస్తరణలో భాగంగా కర్ణాటకకు ఎలా వెళ్లాలని సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండడంతో తెలంగాణలో సైతం ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు మాదిరిగానే తెలంగాణలో సైతం సంక్షేమ అభివృద్ధి పథకాలలో ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే కమిషన్లు తీసుకుంటున్నారని... పేపర్ లీకేజీలో ప్రభుత్వంపై ఆరోపణలు... లిక్కర్ స్కాంపై ఆరోపణలు... ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్లక్ష్యం... నిరుద్యోగ భృతి హామీ అమలు చేయకపోవడం... వీఆర్ఏ, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగడం... రేషన్ డీలర్లు సైతం సమయతమవుతుండడం... ఉద్యోగులు సైతం పి ఆర్ సి, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్... ఉద్యోగ బదిలీల్లో త్రీ వన్ సెవెన్ జీవోపై ఆందోళన... కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యునైజేషన్లు లో జాప్యం ఇలా పలు సమస్యలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్, లక్ష రుణమాఫీ చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇవి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Read More... కర్నాటక ఎఫెక్టు తెలంగాణ మీద ఉండదు.. కాంగ్రెస్కు కేటీఆర్ కంగ్రాట్స్ 

Tags:    

Similar News