BRS: ప్రభుత్వమే నాకు ఇంటిని కేటాయించి కిరాయి కట్టాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్

రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకు ఇంటిని కేటాయించి, కిరాయి కట్టాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) అన్నారు.

Update: 2025-01-14 06:24 GMT
BRS: ప్రభుత్వమే నాకు ఇంటిని కేటాయించి కిరాయి కట్టాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకు ఇంటిని కేటాయించి, కిరాయి కట్టాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) అన్నారు. తనను గృహ నిర్బంధం(House Arrest) చేయడంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. సంక్రాంతికి వచ్చిండ్రు! అని, ఇంత పొద్దున్నే, అదీ పండగ పూట మా అపార్ట్‌మెంట్‌ ముందు మళ్లీ పోలీసులను మొహరించింది రేవంత్ రెడ్డి సర్కార్(Revanth Reddy Government) అని తెలిపారు. అలాగే ఎందుకు వచ్చిండ్రు అంటే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik Reddy) కోసం మేమేమైనా పోరాటం చేస్తమని మా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉంది అని అంటున్నారని, అవును బరాబర్ చేస్తం కూడా.. అది మా బాధ్యత అని చెప్పారు. కానీ కాంగ్రెస్ గూండాల(Congress Goons) లాగా విధ్వంసం చేసే సంస్కృతి మాకు లేదని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి.. ఇప్పటికి మీరు ఎన్నో సార్లు నన్ను గృహనిర్బంధంలో ఉంచిండ్రు అని, నాకు హైదరాబాదు నగరంలో సొంత ఇల్లు కూడా లేదు.. అద్దెకు ఒక చిన్న అపార్ట్‌మెంట్‌ లో ఉంటున్నానని వివరించారు. ప్రతి సారి మా ఇంటికి పోలీసులు వచ్చి హడావిడి చేయడం వల్ల ఈ కాంప్లెక్స్ లో మిగతా కుటుంబాలు చాలా ఆందోళనకు, తీవ్ర అసౌకర్యానికి గురైతున్నారని, వాళ్లు నా పై సానుభూతిని చూపిస్తున్నారు.. మీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. మేము పీడిత ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు వారి గొంతుకగానే పోరాడుతూనే ఉంటాం.. మేం మారం.. మీరు మారుతరన్న నమ్మకం కూడా మాకు లేదని, ఈ యుద్ధానికి విరామం లేదని చెప్పారు. మిగతా అపార్ట్‌మెంట్‌ వాసుల స్వేచ్ఛ, జీవించే హక్కులను దృష్టిలో ఉంచుకుని నాకు మీ ప్రభుత్వమే ఒక ఇంటిని కేటాయించి, కిరాయి మీరే కట్టుకోండి లేదా చీటికి మాటికి మీ పోలీసులను మా అపార్ట్‌మెంట్‌కు పంపించడం మానేయండి అని ఆర్ఎస్పీ రాసుకొచ్చారు.

Tags:    

Similar News