KTR: ఈడీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట

ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసు విచారణలో భాగంగా నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కాసేపటి క్రితమే బషీర్‌బాగ్ (Bashirbagh) ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Update: 2025-01-16 05:29 GMT
KTR: ఈడీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసు విచారణలో భాగంగా నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కాసేపటి క్రితమే బషీర్‌బాగ్ (Bashirbagh) ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. కేటీఆర్ (KTR), ఈడీ ఆఫీస్‌ (ED Office)కు వెళ్తున్నారనే సమాచారం తెలియడంతో అక్కడికి భారీ ఎత్తున బీఆర్ఎస్ (BRS)శ్రేణులు చేరుకున్నాయి. అప్రత్తమైన పోలీసులు కార్యాలయం లోనికి ఎవ్వరిని రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అవిధంగా బషీర్‌బాగ్ (Bashirbagh) పరిసర ప్రాంతాల్లో జనం కిటకిటలాడుతుండటంతో స్పల్పంగా ట్రాఫిక్ జాం (Traffic Jam) అయింది. విచారణ సందర్భంగా కేటీఆర్ (KTR) వెంట అడ్వొకేట్‌ను అనుమతించపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

కాగా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి మునిసిపల్, పట్టణాభివృద్ధి స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ (Arvind Kumar), హెచ్ఎండీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)‌లను ఇప్పటికే ఈడీ (ED) అధికారులు విచారించి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. నేడు వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించి ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లుగా తెలుస్తోంది. 

Tags:    

Similar News