CM Revanth Reddy : జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
తెలంగాణ యోధుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి(S Jaipal Reddy) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు నివాళులు అర్పించారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ యోధుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి(S Jaipal Reddy) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ సాకారంలో జైపాల్ రెడ్డి పోషించిన పాత్ర ప్రజలెప్పుడూ మరిచిపోలేరని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం నిశ్శబ్ద సైనికుడిలా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలక పాత్ర పోషించిన మట్టి బిడ్డ అని కొనియాడారు. రాజకీయాల్లో నిష్కళంక నేతగా, విలువలకు ప్రతీకగా జైపాల్ రెడ్డి నిలిచారన్నారు. వారి ఆశయాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు పాటుపడాలని సీఎం పిలుపునిచ్చారు.