BRS: దొంగలు పడ్డ ఆరు నెలలకా..? కాంగ్రెస్ గురుకుల బాటపై కేటీఆర్ విమర్శలు

బీఆర్ఎస్(BRS) గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారు (Congress Government)లో ఎట్టకేలకు చలనం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.

Update: 2024-12-14 01:57 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్(BRS) గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారు (Congress Government)లో ఎట్టకేలకు చలనం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో నేడు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు గురుకుల హాస్టళ్ల సందర్శనకు(Hurukula Hostels Visit) వెళ్లనున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. పలు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చి, సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో ఆవేదన రేపారని ఆరోపించారు. అలాగే పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే.. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్(KCR) పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ పడ్డారని, దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారని విమర్శలు చేశారు. అంతేగాక గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి అని, ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు- పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి అని చెప్పారు. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు- గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి అని, మంది మార్బలంతో దండయాత్ర చేయకండి- గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి అంటూ.. ఎట్లుండె తెలంగాణ, ఎట్లాయె తెలంగాణ కేటీఆర్ రాసుకొచ్చారు. 

Tags:    

Similar News