సిరిసిల్లలో కేటీఆర్.. సిద్దిపేటలో హరీష్ రావు ‘రైతుదీక్ష’

పంటలు ఎండి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టింది.

Update: 2024-04-06 03:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంటలు ఎండి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జులు ఈ రైతు దీక్షల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి దీక్షలు ప్రారంభం కానున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో, హరీష్ రావు సిద్దిపేట దీక్షలో పాల్గొంటారని బీఆర్ఎస్ అధిష్టానం పేర్కొంది. ఎండిన పంటలకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

నిన్న కరీంనగర్‌ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా పేరిట కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్కహామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు చేయనున్నది. 

Tags:    

Similar News