BRS: అరెకపూడి ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు చెప్పాలి: ఎమ్మెల్యే వివేకానంద్ ఘాటు వ్యాఖ్యలు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు.

Update: 2024-09-11 09:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు విషయంలో నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ కాల యాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి వినతిపత్రం కూడా ఇచ్చామని తెలిపారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా టైంపాస్ చేసేలా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారని ఆరోపించారు. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ స్పీకర్ కార్యాలయంలోనే పెండింగ్‌లోను ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపై తమకు గౌరవం ఉందని, కానీ ఆయన తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో సుప్రీం కోర్టు బెంచ్ ఎమ్మెల్యేల అనర్హతపై కాలయాపన వద్దని గతంలో తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు. హైకోర్టు శ్రీధర్ బాబు అపహాస్యం చేస్తున్నారని, ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటామని అంటున్నారని ధ్వజమెత్తారు. ఇదే పార్టీకి చెందిన రాహుల్ గాంధీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని దేశం మొత్తం తిరిగి చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

పీఏసీ విషయంలో ఏ నిబంధనలు పాటించారో శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలన్నారు. 14 మంది పీఏసీకి నామినేషన్ వేస్తే ఎన్నికలు జరిగాలని, దొంగచాటుగా అరెకపూడి గాంధీతో నామినేషన్ వేయించారని ఆక్షేపించారు. తమ పార్టీకి చెందిన వారు పీఏసీకి మూడు నామినేషన్లు వేశారని నాలుగో పేరు మా పార్టీ తరపున ఎవరు ఇచ్చారో చెప్పాలన్నారు. హరీష్‌రావు వేసి నామినేషన్ కూడా ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. అసలు అరికపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై హై‌కోర్టు ఇచ్చిన తీర్పు చూసి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలు అంతా ఆగమాగం అవుతున్నారని అన్నారు.   


Similar News