Kavitha : బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఫస్ట్ ట్వీట్.. నెటిజన్ల విమర్శలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆ సమయంలో భారీ వాహన శ్రేణితో ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె ఎక్స్ వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. దాదాపు 5 నెలల తర్వాత ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా మొదటి సారిగా ట్వీట్ చేశారు. దీంతో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ప్రజలకు తన నివాసం దగ్గర ప్రజలకు అభివాదం చేస్తున్న ఫోటోను పంచుకున్నారు. పోస్ట్ వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలతో కామెంట్స్ వస్తున్నాయి.
మీరు వెళ్లింది లిక్కర్ స్కాం కేసులో.. సత్యమేవ జయతే అయితే 5 నెలలు జైల్లో ఎందుకు ఉన్నట్టో? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. సత్యం గెలిస్తే మీ కుటుంబం శాశ్వతంగా తీహార్ జైలులో ఉండటం ఖాయమని మరో నెటిజన్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చింది జైలు నుంచి అని, ఉద్యమాలు, పోరాటాలకు కాదు.. అని మరో నెటిజన్ విమర్శించారు. అదేవిధంగా మరో ఆసక్తికర ట్వీట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేశారు. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో తండ్రి కేసీఆర్‌ని ఆలింగనం చేసుకున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ట్వీట్‌పై కూడా నెటిజన్లు, తన అభిమానులు స్పందిస్తున్నారు. తండ్రీ కూతురు కలయిక.. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు.