ఈడీ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది: MLC కవిత

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే తనను విచారిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

Update: 2023-03-21 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే తనను విచారిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈడీ అధికారులు దురుద్దేశంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే గత రెండేళ్లుగా తాను వాడిన ఫోన్లను ఈడీకి అందజేస్తున్నట్లు తెలిపారు. తాను ఫోన్లు ధ్వంసం చేశానని తప్పుడు ప్రచారం చేశారని, ఏ ఉద్దేశంతో ఇలా చేశారని ప్రశ్నించారు. విచారణ పేరుతో ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని వెల్లడించారు. తన ఫోన్లు స్వాధీనం చేసుకునే విషయంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాదని, గత నవంబర్‌లోనే తన ఫోన్లు ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయని అన్నారు. కేసు విచారణకు సంపూర్ణంగా సహకరిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

Also Read: 

ఈడీ ఎదుట హాజరైన MLC కవిత 

Tags:    

Similar News