అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా బీజేపీ నాయకులు సిద్ధమా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ సవాల్ విసిరారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర ఎంతో.. బీజేపీ పాత్ర ఎంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ కు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించిన తీరు ను ఖండిస్తున్నామన్నారు. లీగల్ నోటీసు కు లీగల్ గా స్పందిస్తే ఒకే.. కానీ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు అని ప్రశ్నించారు. బండి కి అసలు ఒకటి నుంచి పది అంకెలు కూడా వచ్చా రావో తెలియదన్నారు. లక్ష కోట్ల లిక్కర్ స్కాం అనడంలో అర్ధం లేదన్నారు.
రాష్ట్రంలో30 లక్షల మంది నిరుద్యోగులు అంటున్నాడని, యూపీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకు తలా లక్ష రూపాయలు ఇవ్వాలడంలో అర్ధం లేదన్నారు. ఎలా సాధ్యమన్నారు. యూపీఎస్సీ పరీక్షలను బీజేపీ నేతలు కొందరు లీక్ చేశారని, నష్ట పోయిన వారికి బీజేపీ కోటి రూపాయలు ఇచ్చిందా? లేకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్ష రూపాయలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఓ ఎంపీగా బాధ్యతగా మాట్లాడాలన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రతి పక్షాలు నిద్ర లేవక ముందే ప్రభుత్వం స్పందించిందని నిందితులపై కేసులు నమోదు చేసిందన్నారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పై నమ్మకం ఉందన్నారు. అప్పటి విద్యార్థి ఉద్యమాలు వేరు.. ఇప్పటి ఉద్యమాలు వేరు అని ఆయన పేర్కొన్నారు.