హైకోర్టు ఆదేశాలు అమలు చేయండి.. అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే పార్టీ ఫిరాయింపుల కేసును సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు.