కేకేతో పాటు కేసీఆర్‌ను కలిసిన BRS ఎమ్మెల్యే.. ప్రచారం నిజమేనా?

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరరావు భేటీ అయ్యారు. కేకే పార్టీ మారబోతున్నారంటూ వార్తలు విస్తృతం కావడంతో అప్రమత్తమైన కేసీఆర్.

Update: 2024-03-28 11:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరరావు భేటీ అయ్యారు. కేకే పార్టీ మారబోతున్నారంటూ వార్తలు విస్తృతం కావడంతో అప్రమత్తమైన కేసీఆర్.. గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి పిలుపించుకున్నారు. కేకేతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఉన్నారు. అయితే, ఇటీవల కేశవరావు ఇంటికి ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్షీ వచ్చి కేకే మరియు కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరాలని వారిని మున్షీ ఆహ్వానించారు. దీంతో వీరు పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి అయ్యాక.. రేవంత్ రెడ్డిని కలిసిన తొలి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్. ఈ క్రమంలో ప్రకాశ్ గౌడ్ కూడా పార్టీ మారడం ఖాయమని వార్తలు విస్తృతం అయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో కేసీఆర్‌తో భేటీ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకున్నది.

Tags:    

Similar News